చింతా రామ కృష్ణా రావు. తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఆంధ్రామృతం;చింతా రామ కృష్ణా రావు.

శ్రీ వేణు గోపక కంద గీత గర్భ చంపకోత్పల శతకము పై శ్రీ నేమానివారి అభిప్రాయము.
RS Rao Nemani
Ayya ! Namaste! ubhayakushalopari.
I have started reading your poems (garbha kavitvamu - Venugopaka satakamu). Your poems are nice.
The pains you have taken are tremendous. Attempting even one poem in garbha kavitvamu is not that
easy. You have made the feat with more than 100 poems. Your work is highly commendable. My
congratulations and best wishes for further improvement in the field.
I will send Adhyatma ramayanamu book to you in a few days. May Gold bless you.
Yours sincerely - Nemani Ramajogi Sanyasi Rao.
2010/12/16

20 April 2024 10:32 PM

ఆంధ్రామృతం;చింతా రామ కృష్ణా రావు.

Ravindra S. Lanka ఇలా వ్రాశారు.
గురువు గారు,
మీ కావ్యం వేణుగోపక శతకం గురువారం గురువు గారు,
మీ కావ్యం వేణుగోపక శతకం గురువారం అందుకున్నప్పటికీ, ఈ రోజు వరకు చదవడం కుదరలేదు. ఈ రోజే కొంత చదివాను. ఏమని చెప్పను? ఆ వేణుగోపుడు, మీరు పక్కపక్కన నిలబడితే మొదట మీ పాదాలకే నమస్కరిస్తానేమో. ఇదివరకు తాడేపల్లి వారి విష్ణులీలాస్తవము చదివినప్పుడు ఆయనకు దండం పెట్టాలనిపించింది. మీకు మాత్రం సాష్టాంగప్రణామాలు. మీరు నావంటి అల్పుడికి పరిచయమవడం, ఈ కావ్యం పంపడం నా పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు.

నా చపలత్వం, అహంకారం కొద్దీ తప్పులు వెతకడం కోసం ప్రయత్నించాను. ఆ పప్పులుడకలేదు. ఇదివరకు మీరు రచించిన సాయీశ్వర శతకంకన్నా విష్ణుగోపక శతకం రమ్యంగా ఉంది. ఈ పుస్తకం ఎవరైనా ప్రచురిస్తే బావుణ్ణు. ప్రస్తుతం మీ బ్లాగులో ప్రచురించండి. ఈ శతకాన్ని నిదానంగా తరచి తరచి చదువుకుంటాను. వీలైతే మరింత అందంగా మలిచి, మీకు పీడీ ఎఫ్ రూపంలో పంపుతాను.

(నా మూఢత్వాన్ని బయటపెట్టుకోడానికై మీకో పద్య సుమం)

శా||
చింతావంశసుధాంబుధీతనయ! సుశ్రీగంధసౌగంధికా
స్వాంతాంతఃసమలంకృతాధివసితస్సంకర్షణా ! హర్షణా !
కాంతాసమ్మితకావ్యపారగ ! ఇలన్ కైవల్యమున్ గూర్పు శ్రీ
కాంతున్ కీర్తన - మీదు బంధరచనా కార్యమ్ము శ్రేయమ్ములౌన్.

మీ శిష్యపరమాణువు,
కన భువి శోభనల్ కమల గాత్రువిశిష్ఠ ప్రకాశధీశతుల్
విన తరమా! రవీ! పరమ పేశల సారస వాఙ్నిధానమా!
ఘన జవ సత్వమౌ కవిత గాంచి వదాన్యులు గాంచు నిన్నుశ్రీ
గుణ గణుడా.సదా వినుత కోవిదుడీవని విశ్వసింతురే.

భువి శోభనల్ కమల గా
త్రువిశిష్ఠ ప్రకాశధీశతుల్విన తరమా!
జవ సత్వమౌ కవిత గాం
చి వదాన్యులు గాంచు నిన్నుశ్రీగుణ గణుడా.

కమల గాత్రువిశిష్ఠ ప్రకాశధీశ!
పరమ పేశల సారస వాఙ్నిధాన!
కవిత గాంచి వదాన్యులు గాంచు నిన్ను
వినుత కోవిదుడీవని విశ్వసింతు.
Ravindra S. Lanka

20 April 2024 7:52 PM

ఆంధ్రామృతం;చింతా రామ కృష్ణా రావు.

సంతోషం అజ్ఞాతగారూ!

05 March 2024 2:54 PM

ఆంధ్రామృతం;చింతా రామ కృష్ణా రావు.

ధన్యవాదాలు కృష్ణమూర్తిగారూ!

05 March 2024 2:52 PM

ఆంధ్రామృతం;చింతా రామ కృష్ణా రావు.

ధన్యవాదాలు సుబ్బారావుగారూ.

07 September 2022 9:59 PM

ఆంధ్రామృతం;చింతా రామ కృష్ణా రావు.

ధన్యవాదములండి.

07 September 2022 9:58 PM

ఇంద్రధనుస్సు;చింతా రామ కృష్ణా రావు.

ధన్యవాదాలు.

11 June 2022 10:40 PM

అసంఖ్య;చింతా రామ కృష్ణా రావు.

నాయనా శుభమస్తు.
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html

08 February 2012 1:56 PM

వాల్మీకి రామాయణము;చింతా రామ కృష్ణా రావు.

రాఘవ మూర్తీ! సుకృతుఁడ!
రాఘవు సత్కావ్య భావ రమ్యంబుగ నా
రాఘవుడొనరింపించెను.
రాఘవు దివ్యాజ్ఞ యట్లు వ్రాయుఁడు, శుభమౌన్.

ఆశీస్సులతో
చింతా రామ కృష్ణా రావు.

27 July 2011 8:46 PM

పద్యమాల;చింతా రామ కృష్ణా రావు.

శ్రీ చక్ర బంధ కవులకు
శ్రీ చక్రమె యొసగు శక్తి శ్రేయస్కరమై.
చూచితి నద్భుతమయ్యా!
ప్రాచీన రచన నరసిన భవ్యుఁడ వయ్యా!.

30 August 2010 11:46 AM

అసంఖ్య;చింతా రామ కృష్ణా రావు.

పదములు మున్నుగా గొనక పన్నుగ నక్షర దేశమెంచియున్
బదిలము చేసి మీ మదిని; పట్టుగ పద్యము వ్రాయఁజూచినన్
మధుర వచో విలాసమున మాన్యుఁడ! బంధము మాననీయమౌన్.
ముదముగ వ్రాయనెంచ; నగు మోమున వాణి ప్రసన్నమౌనుగా.

30 August 2010 7:42 AM

అసంఖ్య;చింతా రామ కృష్ణా రావు.

చిరంజీవీ! సోమశేఖరా!నీవు తురగాన్ని బంధించలేదు. చతురత చూపి తురంగ గమనం సాగించావు. అందుకే ఇది చతురంగ గతి బంధ కవిత అనిపించుకొంటుంది.

26 August 2010 7:48 PM

అసంఖ్య;చింతా రామ కృష్ణా రావు.

చిరంజీవీ! సోమశేఖరా! నీ అసాధారణ ప్రయత్నాన్ని నేనభినందిస్తున్నాను. పద్యం బాగుంది.

26 August 2010 12:32 AM

పద్యమాల;చింతా రామ కృష్ణా రావు.

లంక సత్కవి లాలితంబగు లక్షణాన్విత పద్యముల్
జంకు గొంకు గనంగ జాలక చాల యద్భుత మౌనటుల్
వంక లెన్నగ జాల నట్టుల భవ్యరీతుల నొప్పె.ని
న్నింక చిన్నగ చూడ రాదుగ! ఏమనందువయా? రవీ!

20 August 2010 3:31 PM

సమస్యాపూరణలు;చింతా రామ కృష్ణా రావు.

కోడి వరడ పాలాయెను.
పాడిపశువు వట్టి పోయె; వణికించు చలిన్
వేడిని కలిగించెడు చెలి
తోడిట నాకున్నఁ; దొలగఁద్రోయగ లేనా?

14 August 2010 10:09 AM

పద్యమాల;చింతా రామ కృష్ణా రావు.

This comment has been removed by the author.

10 August 2010 7:58 AM

పద్యమాల;చింతా రామ కృష్ణా రావు.

రవీంద్రా! మిమ్మల్ని ప్రయత్నించమన్న మాట వాస్తవమే.కాని దానిలో ఉన్న చిక్కులు చెప్పలేదన్నారు. నాకైతే చిక్కులేవీ కలుగనందున చెప్పే అవకాశం లేదు. ఆ చిక్కులేంటో వ్రాసేవారికే తెలుస్తాయి. ప్రయత్న వైరళ్యమే చిక్కులన్నీ పోగొట్ట గలదని మీరు వ్రాసి పద్యం మీకు తెలియ జేయ లేదా? వ్రాయాలనే ఆసక్తి కలిగించ గలిగితే అక్కడి నుండి కవి కలమే నడిపిస్తుంది. ఈ పర్యాయం శ్రీ చక్ర బంధం ప్రయత్నించి వ్రాస్తే చాలా ఆనందం నాకు కలిగించిన వారౌతారు. ఈప్సితార్థ ఫలసిద్ధులు కండి.
శుభమస్తు.

02 August 2010 7:46 AM

Telugu pandagalu & Devullu : పండగలు మరియు దేవుల్లు .;చింతా రామ కృష్ణా రావు.

ఆర్యా! భిషగ్వరా! నమస్సులు.
వ్యాసుని ప్రాముఖ్యతను గూర్చి చాలా చక్కగా చెప్పి గురు పూర్ణిమ ప్రాశస్త్యాన్నివివరించారు. నెనరులు.
http://andhraamrutham.blogspot.com

25 July 2010 3:01 PM

ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము;చింతా రామ కృష్ణా రావు.

సతతము సద్గుణావహము సభ్యత సంస్కృతి కాలవాలమై
యతులితమైవెలుంగు మన యద్భుత వేదవిశిష్ట భాగముల్
క్రతువుగ చేయుచున్న యటు గౌరవ పూజ్య విశిష్ఠతేజ!సం
తతములిఖించుచుంటివి సుధాంబుధిగా కనుగొంటి నిచ్చటన్.

19 July 2010 10:01 PM

సమస్యాపూరణలు;చింతా రామ కృష్ణా రావు.

సుమిత్రగారూ! నమస్తే.
మీరేమీ అనుకోకపోతే నాదో చిన్న సూచన.
కంద పద్యంలో నైనా మరే పద్యంలో నైనా సరే ప్రాస నియమం ఉన్న చోట ప్రయోగించే టప్పుడు దానికి గల నియమాన్ని అతిక్రమించ కూడదు.

ప్రాస పూర్వాక్షరం గురువుంటే అంతటా గురువే ఉండాలి. లఘువుంటే లఘువే ఉండాలి.
అలాగే ప్రాససంయుక్తాక్షరమైతే అన్ని పాదాలలోను సంయుక్తాక్షరమే ఉండాలి.
ప్రాస అక్షరానుకి ముందు సున్నా ఉంటే అనుస్వార పూర్వక ప్రాసాక్షరమే అంతటా ఉండాలి.
మీ పూరణలో ఆ నియమాన్నతిక్రమించినట్టున్నారు. సరిచూడండి.

17 July 2010 5:54 AM